హారీష్ జైరాజ్ వార్నింగ్ ఇచ్చిన ముగ్గురు అరెస్ట్.!

Harris-Jayaraj
సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో హారీష్ జైరాజ్ ఒకరు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా వాసు, ఆరెంజ్ లాంటి తెలుగు సినిమాలకు కూడా సంగీతం అందించాడు. తాజాగా హారీష్ ని కిడ్నాప్ చేస్తానని బెదిరించిన ముగ్గురుని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసారు.

అసలు విషయంలోకి వెళితే హారీష్ భార్య అయిన సుమకి రోజూ హారీష్ ని కిడ్నాప్ చేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చేవి. వాళ్ళు 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అందులోనూ హారీష్ సేఫ్ గా ఉండాలంటే మొదట 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు, దాంతో సుమ పోలీసులకు కంప్లైంట్ చేసారు. దాంతో సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు ఆ ముగ్గురు కిడ్నాపర్స్ ని పట్టుకున్నారు. ఆ ముగ్గురు కిడ్నాపర్స్ లో హారీష్ ఫాదర్ కారుకి డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి కూడా ఉండడంతో వారు షాక్ కి గురయ్యారు.

Exit mobile version