‘3 రోజెస్ సీజన్ 2’: ఓటీటీ మూవీగా అలరించనున్న బోల్డ్ సిరీస్..!

3 Roses Season 2

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా లో బోల్డ్ సిరీస్‌గా వచ్చిన ‘3 రోజెస్’(3 Roses Season 2)ప్రేక్షకులను ఎంతమేర అలరించిందో మనం చూశాం. డైరెక్టర్ మారుతి అండ్ టీమ్ నుంచి వచ్చిన ఈ వెడ్ సిరీస్‌కు యూత్‌లో మంచి క్రేజ్ దక్కింది. అయితే, ఆ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘3 రోజెస్ సీజన్ 2’ కూడా ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సిరీస్‌లో ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు లీడ్ రోల్స్‌లో నటించి మెప్పించారు.

అయితే, ఈ వెబ్ సిరీస్‌ను ఇప్పుడు మూవీగా ఈ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు వెబ్ సిరీస్‌ను చూడని వారు ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బోల్డ్ రొమాంటిక్ అండ్ కామెడీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ చెబుతుంది.

హర్ష చెముడు, సత్య, సుదర్శన్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ మూవీగా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాను కిరణ్ కె కరవల్ల డైరెక్ట్ చేయగా, ఎస్‌కెఎన్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version