
ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో యమ ఫేమస్ అయిపోయాడు కమెడియన్ పృథ్వి. మరోసారి మన భారీ కమెడియన్ లౌక్యం సినిమాతో వార్తల్లో నిలిచాడు. తన కెరీర్ లో చాలా సినిమాలలో నటించినా ఈ చిత్రంలో తనకు వచ్చిన గుర్తింపు మరే సినిమాకి రాలేదని చెప్పుకోవాలి
ఆఖరికి లౌక్యం ద్వారా పృథ్వీ ఏ రేంజ్ లో నవ్వించగలడో అర్ధమైంది. బర్నింగ్ స్టార్ బబ్లూ పాత్రలో ఒక రేంజ్ లో నవ్వులు పూయించాడు. సమాచారం ప్రకారం ఈ సినిమాలో చివరి 10నిముషాలలో ఇతని పాత్ర సినిమాకు బాగా ప్లస్ అయినట్టు తెలుస్తుంది. పృథ్వీకి ఇటువంటి పాత్రలు మరిన్ని రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం