ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఉత్కంఠభరిత ఆంథాలజీ చిత్రం ‘4వ అధ్యాయం’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తమిళంలో ‘అధర్మ కథైగళ్’ పేరుతో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ రివేంజ్ డ్రామాను, ఇప్పుడు ‘న్యాయానికి అతీతం’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో తెలుగు వీక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ చిత్రంలో వెట్రి, సాక్షి అగర్వాల్, అమ్ము అభిరామి, దివ్య దురైసామి, సునీల్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. బిగ్ బ్యాంగ్ మూవీస్ బ్యానర్‌పై కామరాజ్ వేల్ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. ప్రతీకారం అనే ప్రధాన ఇతివృత్తంగా నాలుగు విభిన్న కథలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ప్రతీకారానికి దారితీసే పరిస్థితులు, దాని తదుపరి పరిణామాలు, వ్యక్తుల మానసిక క్షోభను దర్శకుడు ఎంతో సహజంగా, ఎమోషనల్‌గా ఆవిష్కరించారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే స్క్రీన్‌ప్లేతో పాటు అద్భుతమైన సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. ఆహాలో ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుండటంతో, ఓటీటీలో అత్యధిక వీక్షణలతో విజయవంతంగా దూసుకుపోతోంది.
