35 మిలియన్ వ్యూస్ తో టాప్ లో కొనసాగుతున్న “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్

పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన మేకింగ్ వీడియో, గ్లింప్స్ విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యి రెండు వారాలు అవుతున్నా, టాప్ లో కొనసాగుతూ ఉండటం విశేషం. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ యూ ట్యూబ్ లో 35 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

వరుస ఫస్ట్ సింగిల్ తోనే ఫాస్టెస్ట్ రికార్డ్ సెట్ చేసిన ఈ ఫస్ట్ సింగిల్ ఇప్పటి వరకూ కూడా 1.1 మిలియన్ లైక్స్ ను, 100కే కామెంట్స్ ను సాధించడం జరిగింది. అంతేకాక తాజాగా విడుదల అయిన రానా దగ్గుపాటి “డానియల్ శేఖర్” వీడియో సైతం యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఒకే చిత్రం నుండి రెండు వీడియో లు ట్రెండ్ అవ్వడం పట్ల పవన్ మరియు రానా దగ్గుపాటి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించడం జరుగుతుంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version