సినిమా ఇండస్ట్రీకి కేవలం 2% సక్సెస్ రేట్ వుందన్న విషయం చాలామందికి తెలిసినదే. 100 సినిమాలు వస్తుంటే 2 హిట్లు రావడమే గగనం అయిపోతున్న రోజులివి అని ఒక సినిమాలో సైతం హృదయాన్ని కదిల్చే డైలాగ్ వుంటుంది. కానీ 2014 దీనికి భిన్నమని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అభిప్రాయం
ఇప్పటికే లెజెండ్, మనం, రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ఈ సంవత్సరంలో ఇటీవల ప్రతీ 30 రోజుల వ్యవధిలో ఒక హిట్ సినిమా మనల్ని పలకరిస్తూ వస్తుందని ఆయన తెలిపారు. వి.వి వినాయక్ ‘అల్లుడు శ్రీను’, సుజీత్ ‘రన్ రాజా రన్’, కోనా వెంకట్ ‘గీతాంజలి’, మారుతి ‘లవర్స్’ సినిమాలే దీనికి సాక్ష్యాలు అని చెప్పుకొచ్చారు
పై సినిమాలు అన్నీ దర్శకుడి ప్రతిభ, కధలో కొత్తదనాన్ని నమ్ముకోవడం వలన వచ్చిన విజయాలే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నాలుగు సినిమాలనూ దిల్ రాజే డిస్ట్రిబ్యుట్ చేసారు
