సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో టాప్ 3లో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. ఇలాంటి సినిమాని మరొకరు టచ్ చేయలేని విధంగా కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్రని తెరపై ఆవిష్కరించారు. అలా ఆయన చేసిన ఈ అల్లూరి సీతారామరాజు సినిమా నేటికి విడుదలై 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా కృష్ణ గారు ఓ భారీ వేడుకని చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన హైదరబాద్ లోని రవీంద్ర భారతిలో అల్లూరి సీతారామరాజు 40 ఏళ్ళ వేడుకని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకలో కృష్ణ, విజయ నిర్మలతో పాటు ఈ మూవీ డైరెక్టర్ రామచంద్ర రావుని కూడా సత్కరించనున్నారు. ఈ వేడుకకి ఈ చిత్ర టీంతో పాలు ఇండస్ట్రీలోని పలు దిగ్గజాలు, హీరోలు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.
