శివన్న, ఉపేంద్రల యాక్షన్ విజువల్ వండర్.. ఆకట్టుకుంటున్న ‘45’ ట్రైలర్!

siva

కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ చిత్రం ‘45 ది మూవీ’. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం రమేష్ రెడ్డి, ఉమా రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటు, సినిమాను జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘45 ది మూవీ’ ట్రైలర్ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంది. వినూత్నమైన ఆయుధాలు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యుద్ధ వాతావరణాన్ని తలపించే సీన్లతో పాటు, సమకాలీన అంశాలను కూడా ఇందులో జోడించినట్లు తెలుస్తోంది. శివన్న వైవిధ్యమైన గెటప్స్, ఉపేంద్ర డైలాగ్ డెలివరీ, రాజ్ బి శెట్టి-మొట్టా రాజేంద్రన్ కాంబినేషన్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ, కె.ఎం. ప్రకాష్ ఎడిటింగ్ బాధ్యతలు వహించగా.. డాక్టర్ కె రవి వర్మ, జాలీ బాస్టియన్ తదితరులు ఫైట్స్ కంపోజ్ చేశారు. అనిల్ కుమార్ మాటలు అందించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version