కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సెన్సార్ కంప్లీటెడ్

patas1
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్న ‘పటాస్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు సోమవారం పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాల వలనే ‘ఏ’ సర్టిఫికేట్ లభించినట్టు సమాచారం. జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యింది.

రచయిత అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కళ్యాణ్ రామ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. శృతి సోది హీరోయిన్. తెలుగులో ఆమెకిదే తొలి సినిమా. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Exit mobile version