కేఏ పాల్ పై పడ్డ వర్మ, సాంగ్ విడుదల.

kapul

వర్మ తాజాగా ప్రజాశాంతి పార్టీ స్థాపకుడు, ఎవెంజలిస్ట్ కె ఏ పాల్ పై ఒక ప్రత్యేక సాంగ్ ని విడుదల చేశారు.జేమ్స్ బాండ్ తరహా ఇంట్రడక్షన్ తో ‘నేనే…కె ఏ పాల్…చూపిస్తా కమాల్…, అనే పాటను యూట్యూబ్ లో వదిలారు. గతంలో పాల్ అనేక వేదికలపై,పలు సందర్భాలలో చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా ఆయన ఈ సాంగ్ రూపొందించారు. జొన్నవిత్తు బాయ్ తో ఐపోయింది, ఇప్పుడు కేఏ పాల్ బాయ్ తో మొదలుపెట్టాను అన్నట్లుగా ఆయన ట్విటర్ లో కామెంట్ కూడా పెట్టారు. అలాగే ఈ సాంగ్ ని చిట్టివలస గ్రామ ప్రజలకు అంకితమిస్తున్నానని ట్వీట్ చేయడం గమనార్హం. కేఏ పాల్ పుట్టిపెరిగిన ఊరు చిట్టివలస.

ఇక కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఇప్పటికే అనేక వివాదాలు రాజేసింది. ఈ చిత్రం కులాల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉందని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వర్మ మాత్రం ఎవరి బెదిరింపులకు, కేసులకు అసలు భయపడటం లేదు. వచ్చే నెలలో ఈ మూవీ విడుదల చేస్తామని చెప్పుకొస్తున్నారు. విడుదలకు ముందే ఇంత వివాదం రాజేసిన ఈ చిత్రం విడుదల తరువాత మరెంత కాంట్రవర్సీ కానుందో చూడాలి.

Exit mobile version