హీరోగా దర్శకుడు.. దిల్ రాజు క్లారిటీ !

Dil-Raju

దర్శకుడు అనిల్‌ రావిపూడి తన మార్క్ కామెడీ టైమింగ్‌ తో వరుస విజయాలను సాధిస్తున్నారు. ఐతే, అనిల్ లో దర్శకుడే కాదు, మంచి నటుడు కూడా ఉన్నాడు. కాగా ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడిని యాక్టర్‌గా తానే పరిచయం చేస్తానని తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కామెంట్స్ చేశారు. ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కి దిల్‌ రాజు, అనిల్‌ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ వేడుకలో దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘అనిల్‌ రావిపూడిలో మంచి నటుడు ఉన్నాడు. అందుకే, తనని యాక్టర్‌గా నేనే పరిచయం చేస్తాను.

గతంలో అనిల్ నాకు కథ వినిపించేందుకు వచ్చినప్పుడల్లా నేను ఇదే మాటను చెప్పేవాడిని’ అని దిల్ రాజు తెలిపారు. ఇక ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ సినిమా విషయానికి వస్తే.. కోలీవుడ్‌ నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌, కృతిశెట్టి జంటగా విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కించిన సినిమా ఇది. ఈనెల 10న తెలుగులోనూ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే, ప్రదీప్‌ రంగనాథన్‌ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తోందో చూడాలి.

Exit mobile version