కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్ డేట్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు రాజశేఖర్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని.. భయంకరమైన విలన్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక బాలకృష్ణ కూడా సినిమాలో రెండు వేర్వేరు పాత్రల్లో కనిపిస్తారట. తండ్రి పాత్రలో, అలాగే కొడుకు పాత్రలో కూడా బాలయ్య కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయనున్నారు. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఎలాగూ దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి.
