యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా ‘డ్రాగన్’. ఈ సినిమా అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. తారక్ ఎంట్రీ సాధారణ హీరో ఇంట్రడక్షన్‌లా కాకుండా భారీ ఎలివేషన్ తో పాటు పాత్రలోని కొత్త వెరీయేషన్ ను కూడా పరిచయం చేసి.. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారట. అంటే.. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ను సినిమాలో హుక్ పాయింట్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
కాగా మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది. కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తోందో చూడాలి.
