
బాలకృష్ణ హీరోగా వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి మొదట పరుచూరి బ్రదర్స్ కథ చెప్పారు. కానీ ఆ కథ దర్శకనిర్మాతలకు ఎవ్వరికి నచ్చకపోవడంతో మళ్ళీ కథ కోసం వినియక్ అన్వేషణ మొదలయింది. కాగా జై సింహా తర్వాత బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ కథ రాసే ప్రయత్నంలో ఉన్న ఎం రత్నం బాలయ్యను కలిసి తాను రాసిన కథ వినిపించారు. బాలయ్యకి కథ నచ్చిందని సమాచారం. త్వరలోనే ఎం రత్నం వినాయక్ ని కూడా కలిసి కథ చెప్పనున్నారు.
ఏం రత్నంకి పవర్ ఫుల్ మాస్ కథలను రాయడంలో మంచి అనుభవం ఉంది. రాజమౌళి సినిమాల్లో చాలావాటికి ఈయనే మాటలు రాశారు. బాలయ్య బాబు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న రత్నంకు , బాలయ్యకి ఎలాంటి కథలు నప్పుతాయో బాగా తెలుసు. అందుకే బాలయ్యకు నచ్చే కథ రాయగలిగారు. కాగా ఈ కథ దర్శకుడు వినాయక్ కి కూడా నచ్చితే త్వరలో వినాయక్, బాలయ్య కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్తుంది.