‘వీర భద్రుడు’ టీంకి సరికొత్త సమస్య.. తెలుగు సినిమాపై దర్శకుడు షాకింగ్ కామెంట్స్ వైరల్

Karuppu

కోలీవుడ్ స్టార్ హీరో టాలీవుడ్ అడాప్టెడ్ సన్ సూర్య హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా దర్శకుడు ఆర్ జే బాలాజీ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రమే ‘వీర భద్రుడు’. తమిళ్ లో కరుప్పు గా వస్తున్న ఈ చిత్రం తాలూకా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. అయితే ఈ సినిమా దర్శకుడు ఆర్ జే బాలాజీ తెలుగు ఆడియెన్స్ కి ఈ సినిమా ఎందుకు థియేటర్స్ లోనే చూడాలి అనేది కూడా చెప్పాడు.

కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే బాలాజీ మన తెలుగు సినిమాపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. గత కొన్నాళ్ల కితం టాలీవుడ్ సినిమాలు కోసం చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కనీస గౌరవం లేకుండా హేళనగా తెలుగు సినిమాల కోసం మాట్లాడి ఇప్పుడు తన సినిమా చూడమని తెలుగు ఆడియెన్స్ ని ఎలా కోరుకుంటున్నాడు అని విమర్శలు తనపై మొదలయ్యాయి. దీనితో వీర భద్రుడు రిలీజ్ పై ఇదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది ప్రశ్నగా మారింది. ఇక ఈ నెగిటివిటీపై బాలాజీ ఏమన్నా క్లారిటీ ఇస్తాడేమో అనేది కూడా చూడాలి.

Exit mobile version