ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో లేటెస్ట్ గా నాలుగో సీజన్ ను ముగించుకున్న సంగతి తెలిసిందే. ఇక అలాగే ఈ సీజన్లో మొదటి నుంచి కూడా భారీ ఫాలోయింగ్ ను సంతరించుకున్న బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజీత్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాడు. అలాగే అందరి గ్రాఫ్ కాస్త అటు ఇటు అయినా కూడా అభిజీత్ మాత్రం చివరి నిమిషం వరకు కూడా దృఢంగా నిలబడ్డాడు.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టైటిల్ అందుకున్న తర్వాత బయటకొచ్చిన అభిజీత్ చాలానే ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టాడు. కానీ లేటెస్ట్ టాక్ ఏమిటంటే అభిజీత్ నుంచి ఒక స్టార్ట్ హీరోయిన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ రానుంది అని. అది ఇప్పటికే అర్ధం అయ్యి కూడా ఉండొచ్చు.
అదే స్టార్ హీరోయిన్ సమంతాతో. సామ్ ఇది వరకే బిగ్ బాస్ హౌస్ షోలో కనిపించింది. అలాగే మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయినటువంటి “ఆహా” ఎందరో స్టార్స్ తో “సామ్ జామ్” అనే షోలో ఇంటర్వ్యూస్ తీసుకొంటున్నారు. మరి ఇదే షోలో అభిజీత్ తో కూడా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ సామ్ తీసుకోనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది.
