శర్వాతో మానస ట్రెండీ లవ్ స్టోరీ ?

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమాలో శర్వానంద్ – హీరోయిన్ మానస వారణాసి లవ్ స్టోరీ చాలా ట్రెండీగా ఉంటుందని.. చాలా ఫన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని తెలుస్తోంది. సాధారణ ప్రేమకథకు భిన్నంగా, నేటి యువత ఆలోచనలు, రిలేషన్‌షిప్ గోల్స్, సోషల్ మీడియా ప్రభావాన్ని టచ్ చేస్తూ ఈ లవ్ స్టోరీ సాగుతుందట. అలాగే హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీతో పాటు ఇద్దరి మధ్య జరిగే డ్రామా, ఫన్నీ కన్వర్సేషన్స్ కూడా వీరి లవ్ ట్రాక్‌ కు మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను తీసుకురానున్నాయట.

ఇక, శర్వానంద్ ఈ సినిమాలో జూనియర్ సైంటిస్ట్ గా కనిపించబోతున్నాడు. తన పాత్ర చుట్టూ సాగే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. సినిమాలో చాలా ఎపిసోడ్స్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని అనీల్ సుంకర నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు.

Exit mobile version