AA23 : గ్లోబల్ ట్రీట్ ఖాయమంటున్న లోకేష్ అసిస్టెంట్

AA23

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న #AA23 చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాను ఊపేస్తుండగా, తాజాగా లోకేష్ అసోసియేట్ రత్నకుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాజెక్ట్‌పై హైప్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా లెవల్‌లోనే కాకుండా, అంతర్జాతీయ అప్పీల్‌తో ఉండబోతోందని ఆయన స్పష్టం చేశారు.

రత్నకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఇది పక్కా పాన్ ఇండియన్ ఫిల్మ్. కేవలం స్టార్స్ ఉన్నారనో లేదా కథ జరిగే ప్రాంతం వల్లో కాదు, ఈ సినిమా కథకు ఉన్న ఇంటర్నేషనల్ అప్పీల్ వల్ల ఇది గ్లోబల్ రేంజ్‌లో ఉంటుంది. అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారంటే, సినిమాను మనం అనుకున్న రీతిలో అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కావాల్సినవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి” అని పేర్కొన్నారు. బన్నీ ఇమేజ్ ఈ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ ఎంటర్‌టైనర్ గురించి మరో ముఖ్యమైన అప్‌డేట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్‌తో దాదాపు మూడు వారాల పాటు చర్చలు జరిగాయని, పక్కా స్క్రిప్ట్‌తో మేకర్స్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇక మే రెండో వారం నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పనులు పట్టాలెక్కనున్నాయి.

Exit mobile version