విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రం 2026 అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఐతే, ఈ చిత్రంలోని ‘నారాయణమ్మ’ అనే మొదటి పాటను ఈ రోజే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. తాజాగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన వేదిక మరియు సమయం ఖరారయ్యాయి.
తమన్ స్వరపరిచిన ఈ ఉత్సాహభరితమైన పాటను హైదరాబాద్‌లోని హోటల్ దాస్పల్లాలో సాయంత్రం 5 గంటల తర్వాత విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరుకానుంది. కాగా ఈ సినిమాలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్ మరియు బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.


