విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమానే ఆదర్శ కుటుంబం. ఫామ్ లో ఉన్న వెంకీ మామ నుంచి అది కూడా త్రివిక్రమ్ లాంటి దర్శకునితో సినిమా అనౌన్స్ కావడంతో బజ్ బాగా నమోదు అయ్యింది. అయితే నేడు మేకర్స్ సినిమా టీజర్ ని విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు.
కానీ అనుకున్న సమయానికి మాత్రం వదల్లేదు. అదే పలు సినిమాల ఫార్మాట్ లో ఆలస్యం చేస్తూ వచ్చి కొత్త సమయాన్ని అనౌన్స్ చేశారు. ఈ సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకి ఆదర్శ కుటుంబం టీజర్ వస్తున్నట్టుగా ఖరారు చేశారు. ఇక మరొక పక్క సినిమా సంగీత దర్శకుడు ఎవరు అనే క్లారిటీ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని హారిక హాసిని సంస్థ నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 2 స్లాట్ లో సినిమాని లాక్ చేసుకున్నారు.
#AK47TEASER coming out today! 🔥
All set to show you ‘A TRIVIKRAM CINEMA’! 😎
And as always, staying true to our STANDARD (delay) TIME… 😅 The #AK47TEASER drops at 04:06 PM!
Stay tuned! @haarikahassine #AadarshaKutumbam #AK47 #VenkateshXTrivikram #Venky77
— Naga Vamsi (@vamsi84) September 12, 2026
