‘రఫ్’ విడుదల తేదిపై ఆది స్పందన.

Rough-(1)
యువ హీరో ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సిహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రఫ్’. నిర్మాణంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత విడుదల తేదిని ప్రకటిస్తామని హీరో ఆది ట్విట్టర్ లో తెలియజేశారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో చిత్రంపై ఆసక్తిని పెంచింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా కోసం ఆది సిక్స్ ప్యాక్ చేశాడు. మణిశర్మ అందించిన స్వరాలు శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన లభిస్తుంది. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అభిలాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరున ‘రఫ్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version