మాస్ లుక్ తో ఆకట్టుకున్న ఆది

aadi-in-rough
ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన యంగ్ హీరో ఆది మొదటి సారిగా పూర్తి రఫ్ లుక్ తో మాస్ ఆడియన్స్ ని మెప్పించేందుకు చేసిన సినిమా ‘రఫ్’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆది ట్రై చేసిన మాస్ లుక్, మాస్ డైలాగ్ డెలివరీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమా కోసం ఆది చేసిన సిక్స్ ప్యాక్ లుక్ కి ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

అలాగే ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీహరి ఓ ముఖ్య పాత్రలో కనిపించడం, గోల్డెన్ లెగ్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించడం వలన ఈ సినిమా ఓపెనింగ్స్ కి బాగా హెల్ప్ అయ్యింది. సుబ్బారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు. అభిలాష్ మాధవరం ఈ సినిమాని నిర్మించాడు. మాస్ ని మెప్పించే కొన్ని అంశాలు ఈ సినిమాలో ఉండడం వలన ఈ సినిమాకి మాస్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

Exit mobile version