
సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ఫుల్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్న సినిమా ‘ఆగడు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ లో మహేష్ బాబులతో పాటు హీరోయిన్ తమన్నా, బ్రహ్మానందం, సోనూ సూద్ లు కూడా పాల్గొంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్.
ఈ సినిమాని సెప్టెంబర్ 19న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఇది వరకే తెలియజేశాను. తాజా సమాచారం ప్రకారం ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోని ఆగష్టు మధ్యలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆగడు’లో ఓ స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ కనిపించనుంది. ‘దూకుడు’, ‘1-నేనొక్కడినే’ సినిమాల తర్వాత 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.