
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘ఆగడు’ సినిమా స్విట్జర్ ల్యాండ్ లో అందమైన ప్రదేశాల నడుమ షూటింగ్ జరుపుకుంటుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. ఈ షెడ్యూల్ లో రెండు రొమాంటిక్ సాంగ్స్ షూట్ చెయ్యాల్సి వుండగా ఇప్పటికే ఒక పాటని పూర్తిచేశారు
శ్రీను వైట్ల ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని హై డోస్ కామెడీ తో నింపుకొస్తున్నాడు. ఈ సినిమా టిపికల్ శ్రీను వైట్ల స్టైల్ లో తెరకెక్కుతుంది. మహేష్ ఈ చిత్రంలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నాడు. బ్రహ్మానందం ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ని 14రీల్స్ సంస్థ నిర్మిస్తుంది