ప్రస్తుతం ‘ఐ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్.. సినిమాను సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చేసేందుకు తన మాస్టర్ బ్రెయిన్ ను ఫుల్లుగా వాడుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో మరియు సినిమా ప్రముఖులలో సినిమాపై క్రేజ్ కలిగించింది. ఈ సినిమా ట్రైలర్ చూసి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇంప్రెస్స్ అయ్యారు. అమీర్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ‘ఐ’ ట్రైలర్ చూసి ఇంప్రెస్స్ అయిన ఈ ‘పీకే’ స్టార్ హీరో.. త్వరలో శంకర్ తో కలసి పని చేయడానికి ఆసక్తి కనబరిచాడట.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించబోయే ‘రోబో’ సీక్వెల్ లో విలన్ పాత్ర కోసం అమీర్ ఖాన్ ను శంకర్ సంప్రదించిన సంగతి తెలిసిందే. ఇంకా అమీర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఓకే చెప్పవచ్చు అని సమాచారం. ఒకవేళ అమీర్ ఖాన్ ‘రోబో 2’లో నటించడానికి అంగీకరిస్తే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
‘ఐ’ విడుదల తర్వాత ‘రోబో-2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తారు. 2015లో షూటింగ్ మొదలవుతుంది.
