ఫోక్ సాంగ్ కు శిరీష్ స్టెప్పులు !

Allu sirish1

యంగ్ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి ) చిత్ర లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం ఓ ప్రముఖ స్టూడియో లో ఫోక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ నేతృత్వంలో శిరీష్ ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నాడు. ఈపాట తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తియైనట్లే. మలయాళ సూపర్ హిట్ మూవీ ఏబిసిడి కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జూదా శాండీ సంగీతం అందిస్తున్నారు.

నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్పణలో బిగ్ బెన్ సినిమాస్ అధినేత యష్ రంగినేని మరియు మధుర శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రం మార్చి 1న విడుదలకానుంది.

Exit mobile version