యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) చిత్రం యొక్క షూటింగ్ నేటితో పూర్తయింది. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ 20లక్షల వ్యూస్ ను రాబట్టి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ ట్రైలర్ తో సినిమా ఫై అంచనాలు పెంచడం లో సినిమా యూనిట్ సక్సెస్ అయ్యింది.
సంజీవ్ రెడ్డి డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ మూవీ ఏబిసిడి కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుండగా భరత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బిగ్ బెన్ సినిమాస్ ,మధుర ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 17న విడుదలకానుంది.
