
ఈ మధ్యకాలంలో ఇతర బాషా చిత్రాలు ఎన్నో తెలుగు లో డబ్ అవుతున్నాయి. అయితే వీటిలో పాటల సాహిత్యం అంచనాలకు తగ్గ రీతిలో ఉండకపోవడం ఒక విధంగా బాధాకరం. ఒరిజినల్ వెర్షన్ లో రాసిన పాటలను డబ్బింగ్ వెర్షన్ లోకి మార్చి రాయడం కష్టతరమైన విద్యే. భాషపై పట్టు వుంటూ, లిప్ సింక్ మిస్ అవ్వకుండా రాయడం కత్తిమీద సామే.
తెలుగు సినిమాని, తెలుగు సినిమా పాటలను ఒక స్థాయికి తీసుకెళ్ళిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇటీవలే ఒకే బంగారం సినిమా ఆల్బమ్ కు సింగిల్ కార్డ్ అందించారు. ఈ పాటలలో డెప్త్ ని అర్ధంచేసుకుంటూ శ్రోతలు ఆయనని ప్రశంసలలో ముంచెత్తారు. ముఖ్యంగా రేహామాన్ కూడా ఆయన పనితీరుని ప్రశంసించారు.
ఒకే బంగారం సినిమా రేపు భారీ విడుదలకు సిద్ధమవుతుంది. దల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రధారులు.

