‘ఆచార్య’ టైంకు ప్రేక్షకుల కళ్ళు తిరగడం ఖాయం

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. మెగా అభిమానులకు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. ఎందుకంటే చిరుతో పాటు రామ్ చరణ్ కూడ ఇందులో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. భారీ వ్యయంతో సినిమా రూపొందుతోంది. అందుకే నిర్మాతలు బిజినెస్ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. భారీ ధరలకే హక్కులను విక్రయించారు. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు థియేట్రికల్ బిజినెస్ రూ.140 కోట్ల పైమాటే. ఒక నాన్ పాన్ ఇండియా సినిమాకు ఇది రికార్డ్ స్థాయి బిజినెస్ అనే అనాలి.

ఇంత పెద్ద మొత్తం రికవర్ కావాలంటే సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావాలి. ఏకధాటిగా మూడు వారలు థియేటర్లలో సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో భీభత్సం సృష్టించాలి. అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం మొదటి వారంలోనే వీలైనంత వెనక్కు రాబట్టుకోవాలని చూస్తున్నారట, అందుకే టికెట్ ధరలకు పెంచుతారట. ఆ పెంచడం 30, 50 కాదు ఏకంగా డబుల్ రేట్. అంటే రూ.150 ఉండే టికెట్ రేట్ ఏకంగా రూ.300లు చేయాలని చూస్తున్నారు. అప్పుడే ఫస్ట్ వీకెండ్ వసూళ్లు డబుల్ అవుతాయని, రికవరీ ఈజీగా ఉంటుందని భావిస్తున్నారట. మొత్తానికి ‘ఆచార్య’ వచ్చే మే 13న ప్రేక్షకులకు టికెట్ రేట్లు చూసి కళ్ళు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version