రాజశేఖర్ కు అగ్ని పరీక్ష

gadam-gang
సీనియర్ నటుడు రాజశేఖర్ గతకొన్నాళ్ళుగా హిట్ సినిమాలు లేక కెరీర్ లో ఒడిదుడుకులకు లోనవుతున్నాడు. దీంతో తన తాజా చిత్రం ‘గెడ్డం గ్యాంగ్’ పై తన ఆశలు, డబ్బులు మొత్తం పెట్టుకున్నాడు

రాజశేఖర్ తన కెరీర్ లోనే తొలిసారిగా ఒక కొత్తపాత్రలో నటించాడు. రీమేక్ హక్కులు సంపాదించడమేకాక నిర్మాతగా వ్యవహరించడం వలన చాలా డబ్బు ఖర్చుపెట్టాడు. సినిమా ప్రచారాల దృష్టిలో పెట్టుకుంటే ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా తరువాత మన యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారక్టర్ రోల్స్ చేసే అవకాశం వుంది.

కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధించి రాజశేఖర్ కెరీర్ లోనే ఈ సినిమా మంచి మలుపుగా మారాలని అందరూ కోరుకుంటున్నారు. అచ్చు సంగీత దర్శకుడు. ఈ సినిమా రేపు విడుదలకానుంది.

Exit mobile version