టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ‘శ్రీమంతుడు’ యాక్షన్ ఎపిసోడ్స్

Mahesh-srimantudu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాలో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని, అవి ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటాయని ఇది వరకే తెలియజేశాం. మేము చెప్పినట్లు గానే శ్రీమంతుడు సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి. కొరటాల శివ మహేష్ బాబు పై షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఇది వరకటి సినిమాలకు భిన్నంగా ఉండేలా చూసుకోవడమే కాకుండా, మహేష్ బాబు కోసం ఓ డిఫరెంట్ మానరిజం ని ట్రై చేసాడు. ఆ మానరిజం మరియు అనల్ అరసు కంపోజ్ చేసిన స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తున్నాయి.

కొరటాల శివ యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడటానికి చాలా క్లాస్ గా కంపోజ్ చేసుకున్నా, ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండడం విశేషం. ఇంటర్వల్ బ్లాక్, సెకండాఫ్ లో వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ చేత సూపర్బ్ అనిపించుకుంటున్నాయి. కొరటాల శివ రెండవ సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలవనుంది. కొరటాల శివ ఓ సోషల్ మెసేజ్ ఉన్న కంటెంట్ ని పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చెప్పడం ఈ సినిమాకి మేజర్ ప్లస్ అయ్యింది. మహేష్ బాబు – శృతి హాసన్ పై వచ్చే ఓ కాలేజ్ ఎపిసోడ్ కూడా యువతని ఆకట్టుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ వారి ప్రొడక్షన్ లో వచ్చిన మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో వారు చాలా హ్యాపీగా ఉన్నారు.

Exit mobile version