ఓటిటి సమీక్ష: ‘సింధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

KathaSudha

విడుదల తేదీ : డిసెంబర్ 14, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : మధునందన్, లావణ్య రెడ్డి, సి.వి.ఎల్. నరసింహారావు, బేబీ భూమి

దర్శకుడు : సతీష్ వర్మ
నిర్మాతలు : దేవరాజ్ పొత్తూరు, పవిత్ర పొత్తూరు
సంగీత దర్శకుడు : జాయ్ సోలమన్
సినిమాటోగ్రాఫర్ : రవీంద్రనాథ్ టి
ఎడిటర్ : అల్లూరి అనిల్ కుమార్ వర్మ

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఈ వారం ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న కథా సుధా వీక్లీ సిరీస్ నుంచి వచ్చిన లఘు చిత్రం ‘సింధు’ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఓ చిన్న కుగ్రామంలో ఉండే చిన్న కుటుంబం రంగ (మధు), లలిత (లావణ్య రెడ్డి) లు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునే చిన్న పాప (బేబీ భూమి) తో ఒక హ్యాపీ జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో తన మనవరాలు మిస్ అయ్యిందని నారాయణరావు (సి వి ఎల్ నరసింహారావు) అదే ఊరికి ఓ పేపర్ యాడ్ ద్వారా వస్తారు. మరి తన మిస్సయ్యిన మనవరాలు ఆమేనా లేక మరో అమ్మాయా? రంగ, లలితా దగ్గరకి ఆ పాప ఎలా వచ్చింది? ఆ పాప చివరికి ఎవరి దగ్గర ఉంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ అండ్ ఫ్రెష్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ కాస్టింగ్ అండ్ టేకింగ్ తో ఈ సినిమా డీసెంట్ గా సాగిపోతుంది. మెయిన్ గా మధు ఫ్యామిలీ స్టోరీ చాలా బాగుంది. సింపుల్ గా ఒక ఇనోసెన్స్ అందులో కనిపిస్తుంది. అంతే కాకుండా బేబీ భూమిపై ఉన్న సన్నివేశాలు ఎంతో క్యూట్ గా చాలా చూడముచ్చటగా అనిపిస్తాయి.

చిన్నారి మాటలు, పలికించే డైలాగ్స్ బాగున్నాయి. ఇక ఆమె తల్లిదండ్రులుగా మధు, లావణ్య రెడ్డిలు ఆ పాత్రల్లో చాలా నాచురల్ గా చేశారు. అలాగే సీనియర్ నటుడు సి వి ఎల్ నరసింహ రావు కూడా బాగా చేశారు. వీటితో పాటుగా ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కి అవి కనెక్ట్ అవుతాయి. ఇంకా ఈ సినిమా వింటేజ్ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా చూపించిన విజువల్స్ (కెమెరా వర్క్) మరియు సంగీతం మరింత ఇంపాక్ట్ చూపించాయి.

మైనస్ పాయింట్స్:

ఇందులో డీసెంట్ అంశాలు ఉన్నప్పటికీ కొన్ని లాజిక్స్ మాత్రం అంత క్లారిటీగా అనిపించవు. నారాయణరావు తన మనవరాలు కోసం వెతికే ప్రాసెస్ కొంచెం సిల్లీగా అనిపిస్తుంది.

అలాగే చాలా చిన్న వయసులో తప్పిపోయిన చిన్నారిని ఇంకో మూడేళ్ళ తర్వాత చూసి కనిపెట్టే లాజిక్ అనేది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా కథనం స్లోగా సాగుతుంది. సో ఇది కూడా ఫ్లో కొంచెం ఫాస్ట్ గా ఉంటే బాగుండు అనిపించేలా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ షార్ట్ ఫిలిం లో నిర్మాణ విలువలు బాగున్నాయి. జాయ్ సోలమన్ ఇచ్చిన సంగీతం బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే రవీంద్రనాథ్ టి ఇచ్చిన కెమెరా వర్క్, ఫ్రేమ్ టోన్ సినిమాకి మరింత ఎఫెక్ట్ తీసుకొచ్చాయి. అల్లూరి అనీల్ ఎడిటింగ్ బాగానే ఉంది కానీ కొంచెం ఫాస్ట్ గా నడిపించి ఉంటే బాగుండేది.

ఇక దర్శకుడు సతీష్ వర్మ విషయానికి వస్తే.. తాను ఒక డీసెంట్ వర్క్ ని అందించారు అని చెప్పవచ్చు. మంచి కాన్సెప్ట్ ని ఎమోషనల్ గా నడిపించి ఆకట్టుకున్నారు. చిన్న లాజికల్ పొరపత్యాలు ఉన్నాయి కానీ ఓవరాల్ గా తన టేకింగ్ అండ్ వర్క్ బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ లఘు చిత్రం ‘సింధు’. ఒక డీసెంట్ అండ్ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు. లీడ్ నటులు చాలా బాగా చేశారు. మెయిన్ గా బేబీ భూమి సన్నివేశాలు ముచ్చటగా అనిపిస్తాయి. చిన్న ఫ్లాస్ ఉన్నాయి కానీ ఈ ఎమోషనల్ షార్ట్ ఫిలిం మాత్రం మెప్పిస్తుంది. చూడండి.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version