పెళ్లి చేసుకోబోతున్న తెలుగు హీరోయిన్ !

Archana

హీరోయిన్ అర్చన (వేద) త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు జగదీశ్‌ తో అర్చన నిశ్చితార్థం బంజారాహిల్స్‌లోని హోటల్ రాడిసన్ బ్లూలో వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి సినీ ప్రముఖులు సుమంత్, నవ్‌ దీప్, శివబాలాజీ తదితరుల హాజరయ్యారు.

కాగా అర్చన జగదీశ్‌ ల పెళ్లి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అర్చన జన్మతహ తెలుగు అమ్మాయి. అయితే ఆమె తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలాగే తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా ఆమె పాల్గొనింది.

Exit mobile version