నారా రోహిత్ హీరోగా నటించిన ‘రౌడీ ఫెలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ విశాఖ సింగ్. ఇప్పుడు ఈ భామకి ఓ అరుదైన గౌరవం దక్కింది. అదేమిటంటే 15వ రోమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఒక జ్యూరీ మెంబర్ గా విశాఖ సింగ్ ని ఇన్విటేషన్ వచ్చింది. ఇటలీలో జరిగే ఈ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ప్రపంచంలో సెలక్ట్ అయిన అన్ని బెస్ట్ ఫిల్మ్స్ వస్తాయి. ఈ అరుదైన అవకాశం తనకి రావడంతో విశాఖ సింగ్ చాలా హ్యాపీ గా ఉంది.
ఈ విషయంపై స్పందిస్తూ ‘ రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నేను ఒక జ్యూరీ మెంబర్ అవ్వడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. యూరప్ దేశాలకు చెందిన ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్, నటీనటులు, నిర్మాతలు మరియు జర్నలిస్ట్ లతో కలిసి నేను ఉండడం చాలా గొప్ప అనుభూతని’ తెలిపింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మే 7 నుంచి మే 15వరకు జరగనుంది. కొద్ది రోజుల క్రితమే విశాఖ సింగ్ ‘పెడ్లెర్స్’ అనే సినిమాని మరొకరితో కలిసి నిర్మించింది. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.
