నటి ఖుష్బూకు తప్పిన ఘోర కారు ప్రమాదం.!

మన తెలుగు మరియు తమిళ భాషలో బాగా తెలిసినటువంటి సీనియర్ హీరోయిన్స్ లో ఖుష్బూ కూడా ఒకరు. తెలుగు మన స్టార్ హీరోలతో మంచి సినిమాలు తీసిన ఈ సీనియర్ నటికి జస్ట్ లో ఘోర ప్రమాదం మిస్సయ్యింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపారు.

ఆమె తన పొలిటికల్ పని నిమిత్తం వేల్ యాత్రకు తన భర్తతో కలిసి వెళ్తుండగా ఒక ట్యాంకర్ వచ్చి ఢీ కొట్టడంతో కారు ఎడమవైపు వెనుక సీట్ ప్రాంతంలో నుజ్జు అయ్యిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఖుష్బూ ఆ కారులో ముందు కూర్చోవడం అలాగే ఎయిర్ బ్యాగ్స్ కూడా సమయానికి తెరుచుకోవడంతో ఈ ఘోర ప్రమాదం నుంచి దేవుడి దయ వాళ్ళ బయటపడ్డామని ఆమె తెలిపారు.

తాను తన భర్త బాగానే ఉన్నామని ఎవరూ కంగారు పడొద్దని తెలిపారు. అలాగే ఆ ట్యాంకర్ డ్రైవర్ ఎందుకు అలా చేసాడో అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారని తెలిపారు. మొత్తానికి మాత్రం ఖుష్భు కు పెను ప్రమాదమే తప్పింది. ప్రస్తుతం కోలీవుడ్ ప్రజలు ఆమెకు ధైర్యం చెబుతుండడంతో ఆమె వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Exit mobile version