
యంగ్ హీరో నితిన్ నటించిన ‘హార్ట్ అటాక్’ సినిమా ద్వారా ఆద శర్మ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఇక్కడ మంచి విజయాన్ని అందుకొని పలు ఆఫర్స్ వస్తున్నా ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ఆద శర్మ ఓ బాలీవుడ్ మూవీకి సైన్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం రష్యాలో డాన్స్ పై స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది.
‘నా మొదటి సినిమాలో డాన్స్ చేసేంత స్కోప్ లేదు. కానీ నా తదుపరి బాలీవుడ్ సినిమాలో బాగా డాన్స్ చేయాల్సిన అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం రష్యాలో ట్రైనింగ్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు జిమ్నాస్టిక్స్ లో మంచి ప్రావీణ్యం ఉండడం వల్ల ఈజీగా నేర్చుకోగలుగుతున్నానని’ ఆద చెప్పింది.
ఇటీవలే వచ్చిన ఓ ప్రకటనకి ఆద తెలుగులో డబ్బింగ్ చెప్పింది. ముందు ముందు తను తెలుగులో చేయాలనుకున్న సినిమాలకు కూడా తనే డబ్బింగ్ చెప్పాలనుకుంటోంది.