అమెరికాలో ‘పటాస్’ థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారు.

patas2
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్’ సినిమా అమెరికాలో కూడా గట్టిగా పేలింది. తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా, అమెరికాలో లక్ష (100కె) డాలర్లు వసూలు చేసింది. లిమిటెడ్ స్క్రీన్ల(20 లోపు)లో విడుదలైన ఈ సినిమా ఇంత వసూలు చేయడం రికార్డని అమెరికాలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన బ్లూ స్కై సినిమాస్ సంస్థ తెలిపింది. సినిమాకు ఎన్నారైల నుండి లభిస్తున్న అద్బుత స్పందన చూసిన తర్వాత రెండవ వారం నుండి అమెరికాలో థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్టు తెలిపారు.

కమర్షియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అయ్యారు. శృతి సోది హీరోయిన్. సాయి కుమార్, అసుతోష్ రాణా, శ్రీనివాస రెడ్డి, ఎమ్మెస్ నారాయణ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించారు.

Exit mobile version