“ఆదిపురుష్” ఆల్బమ్ అంచనాలకు మించే వచ్చిందట.!

Adipurush 3

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ చిత్రం “ఆదిపురుష్” కోసం తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం సాలిడ్ విజువల్ వండర్ గా అయితే రాబోతుంది. మరి ఈ సినిమా టీజర్ సమయంలోనే ఈ సినిమా ఆడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే ఒక ముద్ర పడిపోయింది.

జై శ్రీరామ్ అనే హాంటింగ్ మ్యూజిక్ తో అయితే సంగీత దర్శకులు అజయ్ – అతుల్ లు ఆశ్చర్యపరచగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమా తెలుగు ఆల్బమ్ కి వర్క్ చేసిన ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి ఆదిపురుష్ ఆల్బమ్ పై అంచనాలు పెంచారు. ఈ చిత్రం ఆల్బమ్ ఎప్పుడు ఎలా వచ్చినా కూడా అందరి అంచనాలకి మించే ఉండబోతుంది అంటూ ఇదొక అద్భుతమైన ఆల్బమ్..నా మాట గుర్తుంచుకోండి అంటూ తెలిపారు. అలాగే అజయ్ – అతుల్ లతో వర్క్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని శాస్త్రి గారు తెలిపారు.

Exit mobile version