‘రామాయణ’ కోసం రెహమాన్ కి షాకింగ్ రెమ్యునరేషన్?

AR Rahman 1

ప్రస్తుతం భారతీయ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న భారీ సినిమాల్లో నటుడు రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న సినిమా రామాయణ కూడా ఒకటి. ఇటీవల వచ్చిన టీజర్ తో మంచి రెస్పాన్స్ ఈ సినిమాకి వచ్చింది. అయితే ఈ సినిమాకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ అలాగే ఏ ఆర్ రెహమాన్ లాంటి దిగ్గజాలు సంగీతం అందిస్తున్నారు.

మరి వీరిలో రెహమాన్ కి షాకింగ్ రెమ్యునరేషన్ అందినట్టు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. తను ఏకంగా 30 కోట్ల పారితోషకం అందుకున్నారని వినికిడి. ఇది నిజం అయితే మాత్రం ఇండియన్ సినిమా దగ్గర తనే కాస్ట్లీ సంగీత దర్శకుడు అని చెప్పొచ్చు. మరి ఆ రేంజ్ లోనే వర్క్ ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

ఇక ఈ సినిమాలో యశ్, సన్నీ డియోల్, మాధవన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా నమిత్ మల్హోత్రా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో విడుదల కాబోతోంది.

Exit mobile version