ఇప్పుడు ఇండియా వైడ్ గా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమే “ధురంధర్ 2″(Dhurandhar 2). టాలెంటెడ్ నటుడు రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సెన్సేషనల్ సీక్వెల్ పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా విడుదల అవుతున్న అన్ని చోట్లా ఇప్పుడు సెన్సేషనల్ బుకింగ్స్ ని చూస్తుంది. దీనితో ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్స్ లో ధురంధర్ 2 భారీ రికార్డులు సెట్ చేయడం ఖాయం అని చాలా మంది భావిస్తున్నారు.
మరి ఈ హైప్ తోనే ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు బయటకి వచ్చింది. దర్శకుడు ఇప్పుడు పార్ట్ 2 తర్వాత పార్ట్ 3 ని కూడా ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. పార్ట్ 2 పై కనిపిస్తున్న హైప్ ని చూసి ఆల్రెడీ తాను ధురంధర్ 3(Dhurandhar 3) కోసం కూడా సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో ఉన్నారని వినిపిస్తుంది. ఇప్పుడిది కొంచెం త్వరితం కావచ్చు కానీ పార్ట్ 2 హిట్ అయితే మాత్రం పార్ట్ 3 పై కూడా గట్టి హైప్ ఉంటుంది. సో పార్ట్ 2 ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
