ఆదిత్య వర్మ 8న రావడంలేదు, మరి ఎప్పుడంటే…!

adithya

చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం ఆదిత్య వర్మ. సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి చిత్రానికి తమిళ రీమేక్ గా ఆదిత్య వర్మ తెరకెక్కింది. కాగా ఈ చిత్రాన్ని ఈనెల 8న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఐతే చివరి నిమిషంలో ఈ మూవీ వాయిదాపడిందని తాజా సమాచారం. ఈనెల8 నుండి 21కి ఆదిత్య వర్మ విడుదల తేదీ మారింది.

సెన్సార్ కార్యక్రమాలలో ఏర్పడిన కొన్ని ఇబ్బందుల కారణంగా ఈమూవీ విడుదల తేదీ 21కి మార్చినట్ట్టు తెలుస్తుంది. ప్రొడక్షన్ సమయంలో కూడా ఆదిత్య వర్మ అనేక అవాంతరాలను ఎదుర్కొంది. ఈఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ముఖేష్ మెహతా నిర్మిస్తుండగా, గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. బనిత సందు, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తుండగా రాధన్ సంగీత అందించారు.

Exit mobile version