బయో పిక్ కొరకు కండలు పెంచే పనిలో యంగ్ హీరో

adivi shesh

వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకుని వరుస హిట్స్ అందుకుంటున్నారు హీరో అడివి శేషు. టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరోగా అడివి శేషు మారిపోయారు. ఇక ఈఏడాది ఆయన ఎవరు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని ఓ నూతన క్రైమ్ థ్రిల్లర్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం అందుకొంది. హీరో అడివిశేషు, రెజీనా కాసాండ్రాల నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. కాగా అడివి శేషు ప్రస్తుతం మేజర్ అనే ఓ బయోపిక్ లో నటిస్తున్నారు.

2008లో ముంబైలో జరిగిన టెర్రర్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ కమాండర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మేజర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ కొరకు అడివి శేషు ప్రత్యేకంగా సన్నధం అవుతున్నారు. జిమ్ లో గంటల తరబడి కఠిన కసరత్తులు చేసి కండలు పెంచే పనిలో ఉన్నారు. అలాగే పాత్రలో సహజత్వం కోసం ఈయన కొన్ని ఆర్మీ క్యాంప్స్ సందర్శించడంతో పాటు, అనేక మంది ఆర్మీ అధికారాలను కలవడం జరిగింది. దర్శకుడు శశి కిరణ్ తిక్క తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ నిర్మించడం విశేషం.

Exit mobile version