అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్టంగా’. ఈచిత్రంలోని ‘అరెరే మాయే జరిగిందే’ అంటూ సాగె పాటను ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ ఆలపించారు. ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్లో స్టార్ కమెడియన్ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్‌కి ,మంచి స్పందన వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన `ఇష్టంగా` పాటకు అంతకుమించిన స్పందన వచ్చింది.
ఇక ఈ చిత్ర దర్శకనిర్మాతలు మాట్లాడుతూ మెగాస్టార్ కి .. ఏ జిల్లా ఏ జిల్లా.. అంటూ అద్నాన్ సమీ పాడిన పాటను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేం. ఓ ప్రియా ప్రియా అంటూ నితిన్ `ఇష్క్` కోసం అద్భుతమైన మెలోడీని పాడారాయన. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సాంగ్స్‌ని పాడారు అద్నాన్ సమీ. తాజాగా మరో బ్లాక్ బస్టర్ యుగళగీతాన్ని `ఇష్టంగా` చిత్రానికి పాడినందుకు కృతజ్ఞతలు. అంత మంచి సంగీతం ఇచ్చిన యేలేంద్రకు కృతజ్ఞతలు. అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం. ఈ సాంగ్ లానే ఇష్టంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతుంది అన్నారు.
సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
