తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ఒకే డేట్ లో పలు సినిమాలు క్లాష్ అవ్వడం అనేది కొత్త కాదు. కానీ అదే డేట్ లో ఏ సినిమాలు వస్తున్నాయి? ఏ హీరోల సినిమాలు వస్తున్నాయి అనేది ఆ తేదీని ప్రత్యేకంగా మార్చేస్తుంది. ఇలా మన తెలుగు సినిమా దగ్గర చాలానే క్రేజీ క్లాష్ లు బాక్సాఫీస్ దగ్గర పడ్డాయి కానీ ఈ ఏడాదిలో మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తలపడనుంది.
అది కూడా ఒకటీ రెండేళ్ల తర్వాత కాదు ఏకంగా 30 ఏళ్ల తర్వాత ఈ క్లాష్ పడింది. టాలీవుడ్ టాప్ మోస్ట్ సీనియర్ హీరోస్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ అలాగే హీరో కింగ్ నాగార్జునలు కూడా ఒకరు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి సినిమాలే ఏకంగా 30 ఏళ్ల తర్వాత ఒకే డేట్ లో క్లాష్ కి వస్తున్నాయి.
నాగార్జున కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం కింగ్ 100 ని మేకర్స్ డిసెంబర్ 24న విడుదలకి తెస్తున్నట్టు ఖరారు చేశారు. కానీ ఇదే డేట్ లో బాలయ్య నటిస్తున్న 111 వ సినిమా కూడా విడుదల కానున్నట్టుగా సినీ వర్గాల్లో దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. సో ఇది కూడా నిజం అయితే 1996 లో బాలయ్య వంశానికొక్కడు, నాగ్ వజ్రం సినిమాల రిలీజ్ జనవరి 5 తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి వీరి కాంబినేషన్ ఒకే డేట్ లో రానుంది అని చెప్పొచ్చు. సో బాలయ్య సినిమా యూనిట్ అదే డేట్ ని అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి.
