ఆ ఇంట్రెస్టింగ్ సినిమాకు సీక్వెల్ లో సూర్య.!

Surya

అటు కోలీవుడ్ తో పాటు మన టాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ ఉన్న తమిళ్ హీరోలలో స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. రెండు ఇండస్ట్రీలలో సూర్య మోస్ట్ లవబుల్ హీరోగా మారడానికి కారణం కేవలం తన సినిమాలు మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిత్వం కూడా అని చెప్పాలి. అయితే సూర్య ఇప్పుడు తాను నటించిన ఓ ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా సూర్య మరియు మోహన్ లాల్ ల కాంబోలో కె వి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “బందోబస్త్”.

ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబడిన ఈ చిత్రం మిక్సిడ్ రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ఇదే దర్శకునితో సూర్య హీరోగా తమన్నా హీరోయిన్ గా నటించిన థ్రిల్లర్ చిత్రం “వీడోక్కడే” తమిళ్ లో “అయాన్” గా తీసిన ఈ చిత్రం 2009 లో విడుదలయ్యి రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ చిత్రానికి సీక్వెల్ ఈ కాంబో రెడీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ లో ఉన్న ఈ చిత్రం ఈ కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version