ఫంకీ ఎఫెక్ట్ : రూటు మారుస్తున్న అనుదీప్.. ఈసారి అలాంటి కథతో వస్తాడా..?

anudeep

‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్‌లో ఒక కొత్త తరహా కామెడీ ట్రెండ్‌ను సెట్ చేసిన దర్శకుడు అనుదీప్. ఆ తర్వాత ‘ప్రిన్స్’, ‘ఫంకీ’ చిత్రాలతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా రీసెంట్‌గా వచ్చిన ‘ఫంకీ’ సినిమాపై ఆయన బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఆ సినిమాకు వచ్చిన విమర్శల నేపథ్యంలో, ఆయన తన మేకింగ్ స్టైల్‌ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం కామెడీని నమ్ముకుంటే కెరీర్‌కు ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు తనకు పేరుతెచ్చిన జానర్‌ను పక్కనబెట్టి ఓ సీరియస్ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, సరైన హిట్ కోసం వేచి చూస్తోంది. ముఖ్యంగా ‘రాజాసాబ్’ వంటి పెద్ద ప్రాజెక్టు తర్వాత కథల ఎంపికలో ఆ సంస్థ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అనుదీప్ చెప్పిన ఈ కొత్త తరహా కథపై పీపుల్ మీడియా ఆసక్తి చూపిస్తోంది. ఇందులో అనుదీప్ మార్క్ కామెడీ కాకుండా, ఒక సీరియస్ ఇష్యూను డీల్ చేయబోతున్నారని టాక్.

ప్రస్తుతం ఈ కథకు సరిపోయే ఒక స్టార్ హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోందట. ఒక టాప్ హీరోయిన్ ప్రాజెక్టులోకి వస్తేనే ఈ సినిమాకు మార్కెట్ పరంగా వాల్యూ పెరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది. మరోవైపు, అనుదీప్ దగ్గర ‘జాతిరత్నాలు’ తరహాలో మరో కథ ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టునే పట్టాలెక్కించాలని ఆయన ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version