సల్మాన్ కోసం స్టార్ బ్యూటీని లాక్ చేసిన వంశీ పైడిపల్లి..?

Salman Khan

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించబోతున్న భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న నయనతార, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో జోడీ కట్టడం విశేషం. దీనికి సంబంధించి నయనతార ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో పనిచేస్తుండటం గమనార్హం.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు నయనతార కూడా యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత మరియు సౌత్ స్టార్ హీరోయిన్ కాంబోలో రానున్న ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version