కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ సినిమా కరుప్పు తో భారీ హిట్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సూర్య ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న హిట్ ఆ సినిమాతో వచ్చింది. దీనితో నెక్స్ట్ రానున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పై ప్రెజర్ పడింది. పైగా ఇది క్లాస్, ఫ్యామిలీ డ్రామా కావడంతో ఈ సినిమాకి బుకింగ్స్ ఏమన్నా డ్రాప్ అవుతాయా అని చాలా మంది అనుకున్నారు.
కానీ ఈ సినిమాకి కూడా అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. గత 24 గంటల్లో బుక్ మై షోలో ఏకంగా 4 లక్షల టికెట్స్ కి పైగా సేల్ జరిగింది. ఇది దాదాపు కరుప్పు ప్రీ సేల్స్ తో సరి సమానం అన్నట్టుగా తెలుస్తోంది. ప్రీ సేల్స్ మరియు డే 1 కి కలిపి 7 లక్షలకి పైగా టికెట్ సేల్స్ జరిగినట్టు టాక్. సో మొత్తానికి క్లాస్ సినిమాతో కూడా సూర్య దుమ్ము లేపాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా నాగవంశీ నిర్మాణం వహించారు.
