వెంకీ కోసం అనిల్ రావిపూడి ప్లానింగ్ అదిరిందిగా..!

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆయన కొత్త సినిమా నుంచి పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మెగా బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో వెంకటేష్ ‘లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డి’గా సరికొత్తగా కనిపించనున్నాడు. ఆర్మీ డ్రెస్, స్టైలిష్ స్కార్ఫ్, సన్‌గ్లాసెస్ ధరించి మాసివ్ ఎస్‌యూవీ పక్కన వెంకీ మామ చూపించిన స్వాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో ఆయన కౌంటర్ టెర్రరిజమ్ మరియు హాస్టేజ్ నెగోషియేషన్ ఎక్స్‌పర్ట్‌గా కనిపించబోతున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది. వచ్చే సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారిగా వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుండటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై నెక్స్ట్ లెవెల్ ఎనర్జీని తీసుకురానుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపిస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version