‘లెనిన్’ సక్సెస్ తర్వాత భాగ్యశ్రీ బిగ్ ప్రాజెక్ట్ తో మలయాళ సినిమాలో ఎంట్రీ!

ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో లెనిన్ కూడా ఒకటి. హీరో హీరోయిన్స్ అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే లు ఇద్దరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కంబ్యాక్ అందుకున్నారు. ఇక అఖిల్ నెక్స్ట్ పై ఇంకా క్లారిటీ లేదు కానీ భాగ్యశ్రీ మాత్రం బిగ్ ప్రాజెక్ట్ ని చేతిలో పెట్టుకుంది.

మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా అనౌన్స్ చేసిన లేటెస్ట్ భారీ సినిమా ఆపరేషన్ గంగ సినిమాలో భాగ్యశ్రీ కూడా కీలక పాత్రలో కనిపించడం ఇప్పుడు అనౌన్స్ అయ్యింది. పైగా ఆమెకి ఇది మోలీవుడ్ ఎంట్రీ కూడా కావడం విశేషం. సో అక్కడ ఆమెకి ఎలాంటి రెస్పాన్స్ అందుతుందో చూడాలి.

ఇక ఈ చిత్రానికి దర్శకుడు విష్ణు మోహన్ వర్క్ చేయనుండగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా మేకర్స్ ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. ఈ చిత్రానికి ధురందర్ సంగీత దర్శకుడు సస్వత్ సింగ్ సచ్ దేవ్ పని చేస్తుండడం అంచనాలు మరింత ఉన్నాయి. అలాగే శ్రీ గోకులం సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version